Hyderabad: వర్షానికి కుంగిన కొండాపూర్ మెయిన్ రోడ్డు

ABN , First Publish Date - 2022-06-27T18:28:43+05:30 IST

నగరంలో నిన్న కురిసిన వర్షానికి కొండాపూర్ మెయిన్ రోడ్డు కుంగిపోయింది.

Hyderabad: వర్షానికి కుంగిన కొండాపూర్ మెయిన్ రోడ్డు

హైదరాబాద్: నగరంలో నిన్న కురిసిన వర్షానికి కొండాపూర్ మెయిన్ రోడ్డు కుంగిపోయింది. ఆ సమయంలో అక్కడ పని చేసే వారు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొండాపూర్‌లో నూతనంగా చేపడుతున్న అండర్ పాస్, ప్లై ఓవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో  భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు. కాగా... సేఫ్టీ పాటించకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-06-27T18:28:43+05:30 IST