HGA: హెచ్‌జీఏకి ముచ్చటగా మూడోసారి ప్రతిష్టాత్మక ‘నేషనల్ టూరిజం అవార్డ్’

ABN , First Publish Date - 2022-09-29T02:52:20+05:30 IST

హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్‌జీఏ) (Hyderabad Golf Association) మూడవసారి ప్రతిష్టాత్మక ‘నేషనల్ టూరిజం అవార్డ్’ (National tourism award) స్వీకరించింది.

HGA: హెచ్‌జీఏకి ముచ్చటగా మూడోసారి ప్రతిష్టాత్మక ‘నేషనల్ టూరిజం అవార్డ్’

హైదరాబాద్/న్యూఢిల్లీ: హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్‌జీఏ) (Hyderabad Golf Association) మూడవసారి ప్రతిష్టాత్మక ‘నేషనల్ టూరిజం అవార్డ్’ని (National tourism award) స్వీకరించింది. ‘ బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ గోల్ఫ్ కోర్స్ 2018-19’కి గానూ ఈ అవార్డు దక్కింది. భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ చేతుల మీదుగా తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ టీ.అజయ్ కుమార్ రెడ్డి అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం జరిగిన ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.


కాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ గెలుచుకోవడం ఇది మూడవసారి. హైదరాబాద్ గోల్ఫ్ కోర్సు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్(HGA) ఉమ్మడిగా ప్రారంభించాయి. గోల్ఫ్‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో గోల్ఫ్ కోర్స్, గోల్ఫ్ అకాడమీని అభివృద్ధి చేశాయి. తెలంగాణలో గోల్ఫ్ పట్ల ప్రోత్సహించడం, ప్రచారం, అభివృద్ధి చేయడం హెచ్‌జీఏ ప్రాథమిక లక్ష్యాలుగా ఉన్నాయి.

Updated Date - 2022-09-29T02:52:20+05:30 IST