హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో నాలుగో అంతస్తులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. దీంతో నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తు వరకు పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించాయి. గాంధీ ఆస్పత్రి సిబ్బంది మంటలను గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.