గాంధీలో అసలేం జరుగుతోంది.. ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2020-04-03T12:58:43+05:30 IST

కాలు విరిగినా, పక్షవాతం వచ్చినా.. గుండెజబ్బు వచ్చినా పేదలకు గుర్తుకొచ్చేది గాంధీ ఆస్పత్రి.

గాంధీలో అసలేం జరుగుతోంది.. ఎందుకిలా..!?

  • భయపడుతున్న వైద్య సిబ్బంది

హైదరాబాద్ : కాలు విరిగినా, పక్షవాతం వచ్చినా.. గుండెజబ్బు వచ్చినా పేదలకు గుర్తుకొచ్చేది గాంధీ ఆస్పత్రి. ఎప్పుడు నిత్యం సాధారణ రోగులతో కిటకిటలాడే గాంధీ ఆస్పత్రి ఇప్పుడు కరోనా చికిత్స కేంద్రంగా మారిపోయింది. సాధారణ ఓపీ, ఐపీ అడ్మిషన్ల ను పూర్తిగా నిలిపేసి కరోనా పాజిటివ్స్‌కు చికిత్సలు అందిస్తూ వారిని ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు ఇక్కడి వైద్యులు నిమగ్నమయ్యారు. ఇలాంటి సమయంలో ఓ కరోనా రోగి చనిపోవడంతో అక్కడ ఉద్రిక్త వా తావరణం చోటుచేసుకుంది. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మృతు డి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా వైద్యులపై దాడి చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంతో గాంధీలో వైద్యులకు రక్షణగా పోలీసులు రంగంలోకి దిగారు. కరోనా చికిత్సలు అందించే వార్డుల్లో గట్టి బందోబస్తు చేశారు. ఆస్పత్రి బయట కూడా పోలీసు పహారా ఏర్పాటు చేశారు. గురువారం నాటికి గాంధీ ఆస్పత్రి ముఖచిత్రమే మారిపోయింది. ఒక వైపు కరోనా రోగులు, అనుమానితులు, మరోవైపు పోలీసు బందోబస్తుతో కట్టుదిట్టంగా మారింది. ఇప్పుడు తెలిసి తెలియక ఎవరైనా అస్వస్థతతో గాంధీకి వస్తే వారిని లోపలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. చివరకు మీడియాకూ కూడా నో ఎంట్రీ చెప్పేస్తున్నారు. 


నర్సుల అయోమయం

బుధవారం దాడి ఘటనతో కొందరు నర్సులు వార్డులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అక్కడ పనిచేస్తున్నా వార్డు బాయిలు, సెక్యూరిటీగార్డులు సైతం భయం నీడలో డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కొంత మంది అనుమానితులు నర్సులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నమునాలు ఇవ్వడానికి అనుమానితులు సహకారం అందించపోవడంతో అవస్థలు పడుతున్నారు.


హెడ్‌ఓడీలతో అత్యవసర సమావేశం 

గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ చాంబర్‌లో డీఎంఈ డాక్టర్‌ రమే్‌షరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌, గోపాలపురం ఏసీపీ వెంకటరమణతోపాటు అన్ని విభాగాల హెచ్‌ఓడీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, ఇకపై వైద్యులపై దాడులు జరగకుండా తీసుకునే జాగ్రత్తలపై చర్చించుకున్నారు. వైద్యులకు ఎలాంటి రక్షణ జాగ్రత్తలు ఇవ్వాలని అనే విషయంపై సమావేశంలో చర్చించుకున్నారు. 


దాడిపై ఆరా..

దాడి ఘటన జరిగిన కాసేపటికే నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకు మార్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. గురువారం నగర అదనపు కమిషనర్‌ చౌహాన్‌ పోలీస్‌ ఉన్నతాధికారులను ఆస్పత్రిలో జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. గాంధీలో ఏం జరుగుతుంది. వైద్యులపై దా డి ఎలా జరిగింది.... దాడికి పాల్పడ్డ వ్యక్తుల వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో ఆరా తీసినట్లు తెలిసింది. 


పెరిగిన అనుమానితులు

కరోనా వైరస్‌ అనుమానితులు గురువారం సాయంత్రం సమయానికి 121 మంది రోగులు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఎంత మందికి పాజిటివ్‌ వచ్చిందని రిపోర్టులు వస్తేగాని తెలియదు. రోజు రోజుకూ రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఒక వైపు వైద్యులు, మరో వైపు అనుమానిత రోగులు  హైరానా పడుతున్నారు. సకాలంలో వైద్యం చేయడంలేదన్న విమర్శలువస్తున్నాయి.

Updated Date - 2020-04-03T12:58:43+05:30 IST