వర్షం వదిలినా.. వరద వదలట్లేదు..

ABN , First Publish Date - 2020-10-28T12:27:34+05:30 IST

ఇటీవల కురిసిన వర్షాలకు ఖాళీ స్థలాల్లో నిలిచిన నీరు వరదలా మారి కాలనీలను ముంచెత్తుతోంది. చర్లపల్లి డివిజన్‌ పరిధిలోని బీఎన్‌.రెడ్డి నగర్‌ వారం రోజుల కితం కురిసిన భారీ వర్షాలకు జలమయమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ కాలనీలో ఉన్న ఖాళీ ప్లాట్లు, విశాలమైన స్థలాల్లో నిలిచిన

వర్షం వదిలినా.. వరద వదలట్లేదు..

హైదరాబాద్ : ఇటీవల కురిసిన వర్షాలకు ఖాళీ స్థలాల్లో నిలిచిన నీరు వరదలా మారి కాలనీలను ముంచెత్తుతోంది. చర్లపల్లి డివిజన్‌ పరిధిలోని బీఎన్‌.రెడ్డి నగర్‌ వారం రోజుల కితం కురిసిన భారీ వర్షాలకు జలమయమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ కాలనీలో ఉన్న ఖాళీ ప్లాట్లు, విశాలమైన స్థలాల్లో నిలిచిన వరదనీటిని బయటకు వదలడంతో రోడ్లపై ఉరకలెత్తింది. అసలే అధ్వానపు రోడ్లు, దీనికి తోడు  వర్షాలకు గుంతలుపడి కనీసం నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఇక తమ ఇళ్ల పక్కన వరదనీరు ఇలా నిలిచి ఉంటే ప్రమాదమని కొందరు ఇళ్ల యజమానులు ఖాళీ ప్లాట్లలోని నిల్వ నీటిని బయటకు వెళ్లేలా కాలువలు తీశారు. దీంతో దాదాపు నాలుగు వీధులు జలమయమయ్యాయి. అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేసినట్లు కాలనీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు.

Updated Date - 2020-10-28T12:27:34+05:30 IST