‘ముప్పు పొంచి ఉంది... ఇళ్లను ఖాళీ చేయండి’

ABN , First Publish Date - 2020-10-20T14:04:22+05:30 IST

రానున్న రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ముంపు సమస్యతో బాధపడుతున్న ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌వాసులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు. సోమవారం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ,

‘ముప్పు పొంచి ఉంది... ఇళ్లను ఖాళీ చేయండి’

హైదరాబాద్ : రానున్న రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ముంపు సమస్యతో బాధపడుతున్న ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌వాసులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు. సోమవారం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులతోపాటు కార్పొరేటర్‌ విజయారెడ్డి అన్ని వీధుల్లో తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ముంపు ప్రమాదం ఉన్న బాధితులు ఇళ్లను ఖాళీ చేసి వస్తే వారికోసం స్థానిక వాసవీ కల్యాణమండపంలో వసతి, భోజన సౌకర్యాలు సిద్ధం చేసినట్లు ఉప కమిషనర్‌ గీతారాధిక, తహసీల్దార్‌, కార్పొరేటర్‌ తెలిపారు. 

Updated Date - 2020-10-20T14:04:22+05:30 IST