Hyderabadలో ఫ్లెక్సీల కలకలం

ABN , First Publish Date - 2022-05-05T16:30:18+05:30 IST

నగరంలో అక్కడక్కడ వెలసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్‌కు సిద్థమా అంటూ ప్లెక్సీలు వెలిశాయి.

Hyderabadలో ఫ్లెక్సీల కలకలం

హైదరాబాద్: నగరంలో అక్కడక్కడ వెలసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్‌కు సిద్థమా అంటూ ప్లెక్సీలు వెలిశాయి. నగరంలోని ట్యాంక్ బండ్ , గన్ పార్క్ వద్ద ఈ మేరకు ప్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. నగరంలో రాహుల్ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ఈరోజు వెలసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. గతంలో వైట్ ఛాలెంజ్ అంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఘటన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు జరిగాయి. రాహుల్ వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.... మంత్రి కేటీఆర్‌ను వైట్ ఛాలెంజ్‌కు ప్రతి సవాల్ చేసిన విషయం తెలిసిందే. 

Read more