Hyderabad ఫిలింనగర్‌లో 10 మంది వ్యాపారవేత్తల అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-24T03:19:44+05:30 IST

ఫిలింనగర్‌లో పేకాట ఆడుతున్న వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 10 మంది వ్యాపారవేత్తలను ..

Hyderabad ఫిలింనగర్‌లో 10 మంది వ్యాపారవేత్తల అరెస్ట్

హైదరాబాద్ (Hyderabad): ఫిలింనగర్‌ (filmnagar)లో పేకాట ఆడుతున్న వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 10 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భీమవరానికి చెందిన వ్యాపారవేత్తలు ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో దాడి చేశారు. పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల నుంచి 19 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-07-24T03:19:44+05:30 IST