హైదరాబాద్‌ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు

ABN , First Publish Date - 2021-03-24T18:00:32+05:30 IST

నగరంలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

హైదరాబాద్‌ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు

హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రముఖులకు గోవా నుంచి డ్రగ్స్‌ను పంపించిన డ్రగ్ డీలర్ డాడీ బాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  నాలుగేళ్ళ క్రితం వరకు హైదరాబాద్‌లో ఉండి డ్రగ్స్ బిజినెస్ నడిపిన డాడీ బాయ్ గతంలో డ్రగ్స్ అమ్ముతూ హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్  పోలీసులకు పట్టుబడ్డాడు. గోవా, బెంగుళూర్ కేంద్రంగా హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను పంపుతున్న డాడీ బాయ్ 153  గ్రాముల కొకెయిన్‌ను ఒకే సారి పంపించి ఇక్కడ ప్రముఖలకు డ్రగ్స్ డెలివరీ చేపించే ప్లాన్ సిద్ధం చేశాడు. హైదరాబాద్‌లో గుడ్ స్టఫ్ అంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా మెసేజ్‌లు పెట్టి... జేమ్స్ అనే నైజీరియన్ ద్వారా డ్రగ్స్ డెలివరీ చేయించాడు. ఫోన్ నెంబర్లు ఇవ్వకుండా  వ్వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మొత్తం వ్యవహారం ఆపరేట్ చేశాడు. ప్రముఖ హోటల్స్, నెక్లస్ రోడ్, చెక్ పోస్ట్, డ్రైవ్ ఇన్ లే డెలివరీ స్పాట్స్‌గా ఎంచుకున్నారు. పలువురు ప్రముఖుల పుత్రరత్నాలు ఒకేసారి బల్క్ ఆర్డర్స్ చేశారు. ఈనెల 14న బస్సు ద్వారా డ్రగ్స్ హైదరాబాద్‌కు చేరడంతో డెలివరీ బాయ్ జేమ్స్‌ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు బల్క్ ఆర్డర్ చేసిన ప్రముఖులు ఎవరన్నది ఆరా తీస్తున్నారు. ఒకేసారి 153 గ్రాముల కొకెయిన్, ఎండీఎమ్‌ఏ దొరకడంతో డ్రగ్స్ వ్యవహారంఫై ఎక్సైజ్ శాఖ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. 

Updated Date - 2021-03-24T18:00:32+05:30 IST