హైదరాబాద్‌లో కొంపముంచిన గేట్ టు గెదర్ పార్టీ

ABN , First Publish Date - 2020-05-27T15:39:46+05:30 IST

హైదరాబాద్‌లో కొంపముంచిన గేట్ టు గెదర్ పార్టీ

హైదరాబాద్‌లో కొంపముంచిన గేట్ టు గెదర్ పార్టీ

హైదరాబాద్: నగరంలోని పహాడీషరీఫ్‌లో గెట్ టు గెదర్ పార్టీ కొంపముంచింది. పహాడీషరీఫ్‌లో ఓ మటన్ వ్యాపారి కరోనా బారిన పడ్డాడు. ఆ వ్యాపారి నుంచి మరో వ్యక్తికి  కరోనా వైరస్ సోకగా ఆ విషయం తెలియని సదరు బాధితుడు గెట్‌ టు గెదర్ పార్టీకి వెళ్లాడు. దీంతో అక్కడ దాదాపు 22 మందికి ఈ వైరస్ సోకింది. అందులో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది బాధితులు ఉన్నారు. విషయం తెలిసిన పోలీసులు జియాగూడ, గౌలిపుర, బోరబండ, సంతోష్ నగర్, మహేశ్వరం, హర్షగూడ ప్రాంతాలను కట్టుదిట్టం చేశారు.


దాదాపు 125 కుటుంబాలను పోలీసులు గుర్తించారు.  మొదటి కాంట్రాక్టులో 21 మంది, సెకండ్ కాంటాక్ట్ లో 47 మందిని గుర్తించారు. ఇంటింటి సర్వేకు 40 బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనతో ఫంక్షన్లు , పార్టీలు గెట్ టుగెదర్ పార్టీలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు గ్రీన్‌జోన్‌లు రెడ్‌గా మారటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-05-27T15:39:46+05:30 IST