తాయెత్తు కట్టించుకున్నాడు.. కరోనా తగిలించుకున్నాడు!

ABN , First Publish Date - 2020-04-06T18:53:12+05:30 IST

నగరంలో ఓ కరోనా పాజిటివ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. తాయెత్తు కట్టించుకోవడం వల్ల అతనికి కరోనా సోకిందని సమాచారం.

తాయెత్తు కట్టించుకున్నాడు.. కరోనా తగిలించుకున్నాడు!

హైదరాబాద్: నగరంలో ఓ కరోనా పాజిటివ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. తాయెత్తు కట్టించుకోవడం వల్ల అతనికి కరోనా సోకిందని సమాచారం. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ యువకుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భూతాన్ని తరమడానికి తావీదును నమ్ముకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ఓ దర్గాకు వెళ్లి తాయెత్తు కట్టించుకున్నాడు. ఇక తనకు రాదనుకుని హాయిగా ఉన్నాడు. తర్వాత కొద్ది రోజులకు హాస్పిటల్‌కు వెళ్లి చెక్ చేసుకోగా అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనిపై దర్యాప్తు చేయగా... ఆ తాయెత్తు కట్టిన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని క్వారంటైన్‌లో పెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-04-06T18:53:12+05:30 IST