Shocking : హైదరాబాద్‌లో పెరిగిన Corona వైరస్‌ వ్యాప్తి.. ఒక్కరోజే...!

ABN , First Publish Date - 2022-01-08T14:21:27+05:30 IST

గ్రేటర్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి../.

Shocking : హైదరాబాద్‌లో పెరిగిన Corona వైరస్‌ వ్యాప్తి.. ఒక్కరోజే...!

  •  1452 మందికి పాజిటివ్‌

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లో దాదాపు ఏడు రెట్ల మేర కేసులు పెరిగాయి. ఈ నెల ఒకటిన 217 కేసులు నమోదు కాగా, శుక్రవారానికి ఆ సంఖ్య 1452కు చేరింది. వైరస్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ వర్గాలు సూచిస్తున్నాయి.


మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో 40 ..

మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో శుక్రవారం 40 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏరియా  ఆస్పత్రిలో 18, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరు, మౌలాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11, సఫిల్‌గూడ యూపీహెచ్‌సీలో నాలుగు, ఏకలవ్యనగర్‌లో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. 


కూకట్‌పల్లిలో 30.. 

కూకట్‌పల్లి ప్రాంతంలో శుక్రవారం 481 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్‌ వచ్చింది. జగద్గిరిగుట్ట పీహెచ్‌సీ పరిధిలో ఏడు, కూకట్‌పల్లిలో ఐదు, హస్మత్‌పేటలో ఎనిమిది, బాలానగర్‌లో పది కేసులు చొప్పున నమోదయ్యాయి. 


కుత్బుల్లాపూర్‌లో 10 

కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని నాలుగు యూపీహెచ్‌సీలు, దుండిగల్‌ పీహెచ్‌సీలో శుక్రవారం 477 మందికి కరోనా పరీక్షలు చేయగా, పది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Updated Date - 2022-01-08T14:21:27+05:30 IST