హైదరాబాద్‌లో చిరు వ్యాపారి సామాజిక సేవ

ABN , First Publish Date - 2020-04-03T12:33:30+05:30 IST

బేగంపేట శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌కు చెందిన నెమలి ఆనంద్‌ (నందు) చిన్న కేబుల్‌ వ్యాపారి..

హైదరాబాద్‌లో చిరు వ్యాపారి సామాజిక సేవ

హైదరాబాద్/బేగంపేట : బేగంపేట శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌కు చెందిన నెమలి ఆనంద్‌ (నందు) చిన్న కేబుల్‌ వ్యాపారి. కరోనాతో ప్రజలు అల్లాడిపోవడాన్ని గమనించి నీటిని సరఫరా చేయాలని నిర్ణయించాడు. ద్విచక్ర వాహనంపై ఆయన బేగంపేట వీధుల్లో తిరుగుతూ అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి, ఇతర రాష్ట్రాల  కూలీలకు, అనాథలకు వాటర్‌ బాటిళ్లను అందజేస్తున్నాడు. వారం రోజులుగా నీటి సరఫరా చేస్తున్నానని, ఇప్పటికే 5వేల వాటర్‌ బాటిళ్లను పంపిణీ చేశానని నందు చెప్పాడు. మరో మూడు వేల బాటిళ్లను సిద్ధంగా ఉంచానని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-04-03T12:33:30+05:30 IST