Abn logo
Sep 25 2021 @ 11:55AM

22% తిరస్కరణ

గ్రేటర్‌లో భవన నిర్మాణ అనుమతుల జారీ వేగవంతమైంది. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌(టీఎస్‌- బీపా్‌స)తో పట్టణ ప్రణాళికా విభాగంలో పారదర్శక పౌర సేవల దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, ఇతర నిషేధిత భూముల్లో అధికారిక అనుమతుల జారీ నిలిచిపోయింది. సర్వే నెంబర్ల ఆధారంగా నిషేధిత భూముల్లోని భవన నిర్మాణ ప్రతిపాదనలను ప్రాథమిక దశలోనే అధికారులు తిరస్కరిస్తున్నారు. 


ప్రాథమిక దశలో తిరస్కరిస్తున్న జీహెచ్‌ఎంసీ

బహుళ అంతస్తుల భవన దరఖాస్తుల్లోనూ 7 శాతం తిరస్కరణ

వేగవంతంగా అనుమతుల జారీ

 ఇప్పటి వరకు 7700లకుపైగా దరఖాస్తులు

4500కు పైగా ఆమోదం.. రూ.412. కోట్ల ఆదాయం

నిషేధిత భూముల్లో ఇన్‌స్టంట్‌ దరఖాస్తులు


తక్షణ నమోదు, అనుమతి కోసం వచ్చిన దరఖాస్తులు (75 గజాల్లోపు, 500 చ.మీల విస్తీర్ణం, 

10 మీటర్ల లోపు ఎత్తు వరకు)...

మొత్తం దరఖాస్తులు   6439

ఆమోదించినవి           4071

పరిశీలనలో ఉన్నవి    945

తిరస్కరించినవి        1423


సింగిల్‌ విండో దరఖాస్తులు 

(500 చ.మీల కంటే ఎక్కువ విస్తీర్ణం, 10 మీటర్ల కంటే 

ఎక్కుం ఎత్తుతో నిర్మించేవి)

 మొత్తం దరఖాస్తులు   1327

ఆమోదించినవి 501

తిరస్కరించినవి 96

షార్ట్‌ఫాల్‌ 281

పరిశీలనలో ఉన్నవి 449


హైదరాబాద్‌ సిటీ: భవన నిర్మాణ ప్రతిపాదనలకు వచ్చిన దరఖాస్తుల్లో 90 శాతానికిపైగా నిషేధిత భూముల్లోనివే అని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో దాదాపు 23 శాతం దరఖాస్తులను ప్రాథమిక దశలోనే తిరస్కరించిన ట్లు పేర్కొన్నారు. టీఎ్‌స-బీపా్‌సలో భాగంగా ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు, వాటి స్థితికి సంబంధించిన వివరాలను సంస్థ శుక్రవారం వెల్లడించింది. గతేడాది నవంబర్‌ 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు 7766 దరఖాస్తులు రాగా.. 4500లకు పైగా ఆమోదించారు. 1500లకుపైగా దరఖాస్తులు తిరస్కరించారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.412.66కోట్ల ఆదాయం రాగా.. గతేడాదితో పోలిస్తే రూ.158 కోట్లు అధికమని అధికారులు చెబుతున్నారు. 


విస్తీర్ణం, ఎత్తును బట్టి....

పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి క్షేత్రస్థాయి ఉద్యోగులు, అధికారుల అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మెరుగైన పౌర సేవల్లో భాగంగా టీఎ్‌స-బీపా్‌సను పురపాలక శాఖ అమలులోకి తీసుకువచ్చింది. 75 చదరపు గజాల్లోపు స్థలంలో నిర్మించే భవనాల వివరాలను రూపాయి చెల్లించి జీహెచ్‌ఎంసీ వద్ద నమోదు చేసుకోవాలి. 75 గజాల నుంచి 500చ.మీల్లోపు స్థలంలో నిర్మించే నివాస భవనాల కు(10 మీటర్ల ఎత్తు) రూ.10 వేలు టోకెన్‌ అమౌంట్‌గా చెల్లిస్తూ.. దరఖాస్తు చేయాలి. తక్షణ అనుమతి లభించినా... పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తరువాతే పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. 15 పని దినాల్లో పరిశీలన పూర్తి చేసి.. ఆమోదిస్తారా, తిరస్కరిస్తారా అన్న దానిపై అధికారులు నిర్ణయం తీసుకోవాలి. షార్ట్‌ ఫాల్స్‌ ఉన్న పక్షంలో అధికారులు పంపే సందేశం ఆధారంగా సంబంధిత డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 75 గజాల్లోపు, 500 గజాల వరకు స్థలంలో నిర్మించే దరఖాస్తులు 6439 రాగా.. 4071 ఆమోదించారు. 500 చ.మీల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టే నివాస, వాణిజ్య నిర్మాణాలకు సింగిల్‌ విండో ద్వారా అనుమతులు జారీ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వెంటనే జీహెచ్‌ఎంసీతోపాటు రెవెన్యూ, ఇరిగేషన్‌, అగ్నిమాపక విభాగాలకు ఫైల్‌ వెళ్తుంది. ఆయా విభాగాల నిరభ్యంతర పత్రాలతోపాటు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అన్నీ సక్రమంగా ఉంటే పట్టణ ప్రణాళి కా విభాగం అధికారులు దరఖాస్తు ఆమోదిస్తారు. నిర్ణీత రుసుము చెల్లించాక ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ ఇస్తారు. ఈ తరహ దరఖాస్తులు 1327 రాగా.. 510 ఆమోదించారు. 


ఇవీ పొరపాట్లు....

 75 గజాల్లోపు, 500 గజాల వరకు స్థలంలో నిర్మించే భవనాల దరఖాస్తులు 22 శాతం, 500 గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టే ని ర్మాణాల దరఖాస్తులు 7.23 శాతం తిరస్కరించారు.

 నిషేధిత సర్వే నెంబర్లలో భవన నిర్మాణ దరఖాస్తులను సాఫ్ట్‌వేర్‌ స్వీకరించదు. బై నెంబర్లు, ఇతరత్రా స్వల్ప మార్పులు చేసి అప్‌లోడ్‌ చేస్తున్నారు.


పౌరులకు సూచన ఇది...

 దరఖాస్తులో ప్లాటు ముందున్న రోడ్డు వెడల్పునకు సంబంధించి వాస్తవ వివరాలు నమోదు చేయాలి. 30 అడుగుల కంటే తక్కువగా రోడ్డు ఉన్న పక్షంలో.. రహదారి మధ్య నుంచి ఒక్కో వైపు 15అడుగులు (4.5 మీటర్లు) ఉండేలా స్థలం వదిలేయాల్సి ఉంటుంది. 

 యజమాన్యపు హక్కు పత్రాలతోపాటు లింక్‌ డాక్యుమెంట్లు సమర్పించాలి. 

 తక్షణ అనుమతి పొందినా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయి జీహెచ్‌ఎంసీ కమెన్స్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చిన తరువా తే పనులు ప్రారంభించాలి. 

 తక్షణ అనుమతి పొందే ముందు దరఖాస్తుదారులు తాము సమర్పించే వివరాలు సరైనవని ధృవీకరరించుకోవాలి. దుర్వినియోగానికి పాల్పడినా.. కమెన్స్‌మెంట్‌ లెటర్‌ ఇవ్వకముందే పనులు చేపట్టినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. 

హైదరాబాద్మరిన్ని...