Hyderabad City: కిటకిటలాడిన మెట్రో రైళ్లు

ABN , First Publish Date - 2022-09-26T13:48:12+05:30 IST

ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ను పురస్కరించుకుని క్రికెట్‌ అభిమానులు భారీగా తరలివెళ్లారు. బైకులు, కార్లలో వెళ్తే పార్కింగ్‌ సమస్య ఎదురవుతుందనే

Hyderabad City: కిటకిటలాడిన మెట్రో రైళ్లు

హైదరాబాద్‌ సిటీ: ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ను పురస్కరించుకుని క్రికెట్‌ అభిమానులు భారీగా తరలివెళ్లారు. బైకులు, కార్లలో వెళ్తే పార్కింగ్‌ సమస్య ఎదురవుతుందనే ఉద్దేశంతో చాలామంది సమీప మెట్రో స్టేషన్ల నుంచి మైదానానికి చేరుకున్నారు. నగరంలోని మెట్రో రైళ్లు మధ్యాహ్నం నుంచి కిటకిటలాడాయి. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు, తిరిగి రాత్రి 11.30 నుంచి ఒంటి గంట వరకు విపరీతమైన రద్దీ కనిపించింది. మ్యాచ్‌ను పురస్కరించుకుని రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉప్పల్‌, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి మాత్రమే ప్రయాణికులు ఎక్కేందుకు అనుమతి ఇవ్వగా, దిగేందుకు అన్ని చోట్లా అవకాశమిచ్చారు. మ్యాచ్‌ తర్వాత ఈ రెండు స్టేషన్లలో భారీ రద్దీ నెలకొంది. ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, నాగోలు- రాయదుర్గం కారిడార్ల నుంచి ఆదివారం దాదాపు 3.50 లక్షల మంది ప్రయాణించినట్లు తెలిసింది. 

Updated Date - 2022-09-26T13:48:12+05:30 IST