దమ్మాయిగూడెంలో చిన్నారి కిడ్నాప్ కలకలం

ABN , First Publish Date - 2021-07-10T16:23:39+05:30 IST

జవహర్‎నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడెంలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగుడు చిన్నారి కిడ్నాప్ చేయడానికి యత్నించాడు.

దమ్మాయిగూడెంలో చిన్నారి కిడ్నాప్ కలకలం

హైదరాబాద్: జవహర్‎నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడెంలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగుడు చిన్నారి కిడ్నాప్ చేయడానికి యత్నించాడు. కిడ్నాప్ చేసే సమయంలో తల్లిని గమనించిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుడు పరారైన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఐదు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ రెండు ఘటనలు ఒకే ప్రాంతంలో జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిందితులను పట్టుకొని శిక్షించాలని దమ్మాయిగూడెం వాసులు కోరుతున్నారు.

Updated Date - 2021-07-10T16:23:39+05:30 IST