Hyderabad: డ్యాన్సర్‌ది హత్యే.. ఇద్దరి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-11-10T17:06:28+05:30 IST

అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళా డ్యాన్సర్‌ హత్యకు గురైనట్లు ఫలక్‌నుమా పోలీసులు తేల్చారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్‌ చేసి మంగళవారం రిమాండ్‌కు

Hyderabad: డ్యాన్సర్‌ది హత్యే.. ఇద్దరి అరెస్ట్‌

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళా డ్యాన్సర్‌ హత్యకు గురైనట్లు ఫలక్‌నుమా పోలీసులు తేల్చారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్‌ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఫలక్‌నుమా పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ గజారావు భూపాల్‌ వివరాలను వెల్లడించారు. ఫలక్‌నుమా ముస్తఫానగర్‌కు చెందిన షీరీన్‌ ఫాతిమా(30) మొదటి భర్త విడాకులివ్వగా, రెండో భర్త నదీం ఏడాది క్రితం మృతిచెందాడు. ఫంక్షన్‌ హాళ్లలో ఆర్కెస్ర్టా డ్యాన్స్‌ చేస్తూ తన ఏడుగురు సంతానాన్ని పోషించుకుంటోంది. 2019లో క్యాబ్‌ బుక్‌ చేసిన సమయంలో చంచల్‌గూడకు చెందిన డ్రైవర్‌ మహ్మద్‌ అఫ్సర్‌(30)తో పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లిచేసుకోవాలని అఫ్సర్‌ను కోరింది. డ్యాన్స్‌లు మానుకుంటే చేసుకుంటానన్నాడు. ఇంతలో ఆమె మరొకరితో చనువుగా ఉంటోందని అనుమానించడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.


ఈ క్రమంలో అఫ్సర్‌పై గతంలో ఛత్రినాక, డబీర్‌పురా పోలీ్‌సస్టేషన్లలో ఫిర్యాదు కూడా చేసింది. తనకు తలనొప్పిగా మారిన షీరీన్‌ను అంతమొందించాలని భావించి, ఈనెల 8న రాత్రి ఫంక్షన్‌హాల్‌లో ఉన్న షీరీన్‌ ఫాతిమాను మాయమాటలతో ముస్తఫానగర్‌లోని ఆమె ఇంటికి తీసుకొచ్చాడు. ఇద్దరూ మద్యం తాగిన తర్వాత మరోసారి గొడవపడ్డారు. గొడవలో అఫ్సర్‌ ఆమె గొంతు నులిమాడు. కొన ఊపిరితో ఉన్న ఆమెను అఫ్సర్‌ స్నేహితుడు మహ్మద్‌నాహెద్‌ చున్నీతో గొంతుకు బిగించి హత్యచేసి, అక్కడి నుంచి పరారయ్యారు. పోస్టుమార్టం రిపోర్టులో హత్యగా తేలడంతో అఫ్సర్‌, మహ్మద్‌ నాహేద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-11-10T17:06:28+05:30 IST