హైదరాబాద్‌, బెంగళూరు విమానాలకు..తృటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-01-15T09:49:03+05:30 IST

అది దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చే ఎమిరేట్స్‌ బోయింగ్‌-777 విమానం(ఈకే-524)..! టేకా్‌ఫకు సిద్ధమైంది.

హైదరాబాద్‌, బెంగళూరు విమానాలకు..తృటిలో తప్పిన ప్రమాదం

  • దుబాయ్‌లో ఒకే రన్‌వే పైకి రెండు ఎమిరేట్స్‌ విమానాలు
  • హైదరాబాద్‌ విమానాన్ని ఆపిన ఏటీఎస్‌

దుబాయ్‌, జనవరి 14: అది దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చే ఎమిరేట్స్‌ బోయింగ్‌-777 విమానం(ఈకే-524)..! టేకా్‌ఫకు సిద్ధమైంది..! విమానాన్ని పైలట్‌ రన్‌వే నంబరు 30ఆర్‌పైకి తీసుకువచ్చారు..! టేకా్‌ఫకు విమానాన్ని సిద్ధం చేసేందుకు విమాన వేగాన్ని పెంచారు..! అలా క్షణాల్లో విమానవేగం గంటకు 240 కిలోమీటర్లకు పెరిగింది. పైలట్లు తమ ముందు.. బెంగళూరుకు వెళ్లనున్న ఎమిరేట్స్‌(ఈకే- 568) విమానం టేకాఫ్‌ కోసం సిద్ధమవ్వడాన్ని గమనించారు..! అంతే..! కాసేపైతే..! రెండు విమానాలు ఢీకొంటే..! జరిగే నష్టం అంతా ఇంతా కాదు..! ఆ సమయంలో ఒక్కో విమానంలో మూడొందల మందికి పైగా ప్రయాణికులున్నారు..! దుబాయ్‌ విమానాశ్రయ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) సిబ్బంది దీన్ని గుర్తించి, వెంటనే హైదరాబాద్‌ విమానాన్ని పక్కనే ఉన్న ట్యాక్సీ-బేపైకి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు..! ప్రయాణికుల అదృష్టం.. పైలట్ల సమయస్ఫూర్తితో విమాన వేగాన్ని తగ్గించి, ఏటీసీ ఆదేశాలను పాటించడంతో పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు విమానం 790 మీటర్ల దూరంలో ఉండగా.. హైదరాబాద్‌ విమానం పక్కకు తప్పుకొంది. ఈ ఘటన ఈ నెల 9న చోటుచేసుకుంది. వాస్తవానికి రెండు విమానాల టేకా్‌ఫకు మధ్య 5 నిమిషాల తేడా ఉండాలి. కా నీ, ఒకేసారి క్షణాల తేడాతో అవి రన్‌వేపైకిపైకి వచ్చా యి. దీనిపై యూఏఈకి చెందిన ఎయిర్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ సెక్టార్‌ విచారణ ప్రారంభించింది. భారత పౌరవిమానయాన సంస్థ డీజీసీఏ కూడా ఈ ఘటనపై నివేదిక ప్రతులివ్వాలని ఏఏఐసీని కోరింది. 

Updated Date - 2022-01-15T09:49:03+05:30 IST