Hyd: మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్ ఇళ్లపై ఈడీ దాడులు

ABN , First Publish Date - 2022-07-27T17:37:03+05:30 IST

లోకల్ ఏజెంట్లు మాధవ రెడ్డి, చికోటి ప్రవీణ్ ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది.

Hyd: మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్ ఇళ్లపై ఈడీ దాడులు

హైదరాబాద్ (Hyderabad): లోకల్ ఏజెంట్లు మాధవ రెడ్డి (Madhavareddy), చికోటి ప్రవీణ్ (Praveen) ఇంటిఫై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు చేసింది. బోయిన్ పల్లిలో ఉన్న మాధవ రెడ్డి ఇంట్లో సోదాలు  కొనసాగుతున్నాయి. ఇండో-నేపాల్ (Indo-Nepal) సరిహద్దుల్లో క్యాసినో (Casino) నిర్వహణపై ఈడీ సోదాలు చేస్తోంది. క్యాసినో ఆడే వారి కోసం స్పెషల్ ఫ్లైట్‌ (Special Flight)లలో లోకల్ ఏజెంట్లు (Local Agents) టిక్కెట్లు ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వెస్ట్ బెంగాల్‌లోని బాగ్ డోగ్ర ఎయిర్‌పోర్టుకు కస్టమర్లలను ఏజెంట్లు తరలించారు. అక్కడి నుంచి నేపాల్‌లోని హోటల్ మెచి క్రౌన్‌లో ఆల్ ఇన్ క్యాసినో పేరుతో ఈవెంట్ నిర్వహించారు. జూన్ 10వ తేదీ నుంచి 13 వరకు ఇండో నేపాల్ బార్డర్‌లో ఈవెంట్ ప్రైజ్ మనీని హవాలా రూపంలో చెల్లించారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నుంచి ఆపరేషన్  సాగింది. క్యాసినో ఒక్కో కస్టమర్ నుంచి లోకల్ ఏజెంట్లు రూ. 3 లక్షలు వసూలు చేశారు. నాలుగు రోజుల ప్యాకేజీలో భాగంగా ప్లాన్ టారిఫ్‌లు నేపాల్‌తో పాటు ఇండోనేషియాలోనూ క్యాసినో ఈవెంట్‌లు నిర్వహించారు. ఫెమా కింద కేసు నమోదు చేసిన ఈడీ.. హైదరాబాద్‌లో మొత్తం 8  చోట్ల దాడులు చేసింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-07-27T17:37:03+05:30 IST