TS News: హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత..

ABN , First Publish Date - 2022-07-22T20:46:01+05:30 IST

జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) రోడ్ నంబర్-45లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

TS News: హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్తత..

హైదరాబాద్ (Hyderabad): జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) రోడ్ నంబర్-45లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఇళ్లను (houses) కూల్చివేసే ప్రయత్నం చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు సిబ్బందితో బస్తీ వాసులు వాగ్వాదానికి దిగారు. అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చేసేదేమీలేక అధికారులు, పోలీసులు అక్కడినుంచి వెనుదిరిగారు.

Updated Date - 2022-07-22T20:46:01+05:30 IST