1,500 ఎకరాల్లో ‘హైదరాబాద్‌ ఏరోసిటీ’

ABN , First Publish Date - 2021-04-17T06:32:48+05:30 IST

ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే దిశగా జీఎంఆర్‌ గ్రూప్‌ ‘జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఏరోసిటీ’ పేరుతో ఆధునిక బిజినెస్‌ డిస్ట్రిక్‌ను ఏర్పా టు చేస్తోంది. శంషాబాద్‌ విమానాశ్రయ ప్రాంగణంలో 1,500

1,500 ఎకరాల్లో ‘హైదరాబాద్‌ ఏరోసిటీ’

జీఎంఆర్‌ గ్రూప్‌ అభివృద్ధి బిజినెస్‌, రిటైల్‌ పార్కులు 10 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం


హైదరాబాద్‌ (ఆంధ్రజోతి బిజినెస్‌): ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే దిశగా జీఎంఆర్‌ గ్రూప్‌ ‘జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఏరోసిటీ’ పేరుతో ఆధునిక బిజినెస్‌ డిస్ట్రిక్‌ను ఏర్పా టు చేస్తోంది. శంషాబాద్‌ విమానాశ్రయ ప్రాంగణంలో 1,500 ఎకరాల్లో విస్తరించి ఉండే హైదరాబాద్‌ ఏరోసిటీలో బిజినెస్‌, రిటైల్‌, ఏరోస్పేస్‌, ఇండస్ట్రియల్‌, లాజిస్టిక్స్‌ పార్కులు ఉంటాయి. స్కూళ్లు, హెల్త్‌కేర్‌ సదుపాయాలు, అద్దెకు తీసుకునేందుకు వసతి సదుపాయాలు, వినోదం తదితరాలతో పూర్తి స్థాయి నివాస, వర్కింగ్‌ అనుభవాన్ని పొందే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నామని జీఎంఆర్‌ గ్రూప్‌ వెల్లడించింది. జీఎంఆర్‌ ఏరోసిటీలో ‘జీఎంఆర్‌ ఇంటర్‌ఛేంజ్‌’ పేరుతో చేపట్టే ప్రాజెక్టులో సినిమా, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌ మొదలైనవి ఉంటాయని నాణ్యమైన వినోదం, రిటైల్‌, ఎంటర్‌టైన్‌మెంట్ల కొరతను ఇది తీరుస్తుందని కంపెనీ తెలిపింది.


‘ఆతిథ్యం’ కోసం ‘హాస్పిటాలిటీ డిస్ట్రిక్‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా బిజినెస్‌ పార్కులో గ్రేడ్‌-ఏ కార్యాలయ, బిల్ట్‌-టు-సూట్‌ సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. టెలికామ్‌, విద్యుత్‌, ఐటీ మౌలిక సదుపాయాలతో పని చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యాలయ స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ ల్యాండ్‌ డెవల్‌పమెంట్‌ సీఈఓ అమన్‌ కపూర్‌ తెలిపారు. దాదాపు 10 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం నాలుగు టవర్లలో దశల వారీగా అందుబాటులోకి వస్తుంది. ఇది భవిష్యత్తులో బిజినెస్‌ కారిడార్‌గా అభివృద్ధి చెందుతుందని జీఎంఆర్‌ గ్రూప్‌ భావిస్తోంది. హైదరాబాద్‌ ఏరోసిటీ దేశంలోనే సరికొత్త ఒరవడిని సృష్టించగలదని అమన్‌ కపూర్‌ అన్నారు. 

Updated Date - 2021-04-17T06:32:48+05:30 IST