అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-16T15:24:47+05:30 IST

అప్పుల వాళ్ళ వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది.

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్: అప్పుల వాళ్ళ వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అడ్డగుట్టలో చెరుకు వ్యాపారి కిరణ్‌పై కరోనా దెబ్బ పడింది. ఎండాకాలంలోనే కరోనా ప్రారభంకావడంతో వ్యాపారంపై ప్రభావం చూపింది. ఇది చాలదన్నట్లు వర్షం, వరదల కారణంగా చెరుకు గోడౌన్ కూలిపోవడంతో కిరణ్ మరింత అప్పుల్లో కూరుకుపోయాడు. అధిక వడ్డీలు వసూళ్లు చేయడమే కాకుండా వేధింపులు, గుర్తు తెలియని వ్యక్తులను పంపించి బెదిరింపులు పాల్పడ్డారు. భార్య, తల్లి, బస్తీ వాళ్ళ ముందు జరిగిన అవమానం భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరణ్‌ ఫ్యాన్ సీలింగ్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టి మరి కిరణ్ ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడికి భార్య, 10ఏళ్ల లోపు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కిరణ్ ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోను తన సోదరికి  పంపించాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-16T15:24:47+05:30 IST