నకిలీ మెయిల్ ఐడీతో భారీగా నగదు డ్రా

ABN , First Publish Date - 2020-07-16T14:30:46+05:30 IST

నకిలీ మెయిల్ ఐడీతో భారీగా నగదు డ్రా

నకిలీ మెయిల్ ఐడీతో భారీగా నగదు డ్రా

హైదరాబాద్: ఓటీపీ నకిలీ మెయిల్ ఐడీ పేరుతో సైబర్ నేరగాళ్లు 5 లక్షల 50 వేల నగదును ఆన్‌లైన్ ద్వారా డ్రా చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్... అమెరికాకు చెందిన ఓ కంపెనీ నుండి ల్యాబ్‌కు సంబంధించి కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. మెయిల్ ద్వారానే ట్రాన్సాక్స‌న్స్ జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ల్యాబ్‌ యూకేకు చెందిన కంపెనీ మెయిల్‌ ప్రాబ్లం ఉందని...మరో మెయిల్ ఐడీ పంపిస్తామంటూ ప్రసాద్ ల్యాబ్‌కు మెసేజ్‌లు వచ్చాయి. మరో మెయిల్ పంపించి దానికి మనీ ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు. నిజమని నమ్మిన ప్రసాద్ ల్యాబ్...సైబర్ నేరగాళ్లు పంపిన మెయిల్ ఐడీకి 4 లక్షల 95 వేల నగదు ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే  మనీ రాలేదని  కంపెనీ వారు చెప్పడంతో మెయిల్ ఐడీ చెక్ చేయగా...అది నకిలీ మెయిల్ అని గుర్తించారు. దీంతో హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ప్రసాద్ ల్యాబ్  మేనేజర్ రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-07-16T14:30:46+05:30 IST