హైదరాబాద్‌కు ఆల్‌ఖైదా ఉగ్రవాది జుబెర్‌

ABN , First Publish Date - 2020-05-27T00:09:41+05:30 IST

ఆల్‌ఖైదా ఉగ్రవాది జుబెర్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అల్వాల్‌లోని తన నివాసానికి జుబెర్‌ను తరలించారు.

హైదరాబాద్‌కు ఆల్‌ఖైదా ఉగ్రవాది జుబెర్‌

హైదరాబాద్: ఆల్‌ఖైదా ఉగ్రవాది జుబెర్‌ను పోలీసులు  హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అల్వాల్‌లోని తన నివాసానికి జుబెర్‌ను తరలించారు. 2016లో  అమెరికా అధికారులు జుబెర్‌ను అరెస్ట్‌ చేశారు. 16 రోజుల క్రితం అమెరికా అధికారులు ఆయన్ను ఇండియాకు పంపించారు. 14 రోజుల పాటు అమృత్‌సర్‌లో క్వారంటైన్‌లో జుబెర్‌ను ఉంచారు. క్వారంటైన్‌ పూర్తి కావడంతో హైదరాబాద్‌కు పోలీసులు తీసుకువచ్చారు. ఆల్‌ఖైదాకు నిధులు సేకరించారన్న ఆరోపణలపై జుబెర్‌ అరెస్ట్‌ చేశారు. జుబెర్‌ ఫోన్‌ కాంటాక్టులు, సోషల్‌ మీడియా కదలికలపై పోలీసుల దృష్టి పెట్టారు. 

Updated Date - 2020-05-27T00:09:41+05:30 IST