హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బృందాలతో మోటార్లతో పలుచోట్ల నిలిచిపోయిన నీటిని తొలగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.