HYD: 100% వ్యాక్సినేషన్ డ్రైవ్‎ను పొడిగించనున్న జీహెచ్ఎంసి

ABN , First Publish Date - 2021-08-29T16:27:45+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‎లో భాగంగా నగరంలో నిర్వహిస్తున్న అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. కొవిడ్ టీకా వేసుకునేందుకు ఇటీవల చాలా మంది ఆసక్తి చూపుతున్నారు

HYD: 100% వ్యాక్సినేషన్ డ్రైవ్‎ను పొడిగించనున్న జీహెచ్ఎంసి

హైదరాబాద్: కరోనా వ్యాక్సినేషన్‎లో భాగంగా నగరంలో నిర్వహిస్తున్న అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. కొవిడ్ టీకా వేసుకునేందుకు ఇటీవల చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇందు కోసం ప్రభుత్వం నగర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయిస్తోంది. అయితే.. నగరంలో వందశాతం వ్యాక్సినేషన్ డ్రైవ్‎ను పొడగించనుంది. మరో మూడు రోజుల్లో ముగియనున్న స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‎ను 100% టార్గెట్ పూర్తి కాకపోవడంతో డ్రైవ్‎ను బల్దియా పొడిగించనున్నది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో 70% మాత్రమే టీకా పంపిణి చేశారు. ఇంత వరకు ఓల్డ్ సిటీలో 50% టీకా పంపిణి మించలేదు. పలుచోట్ల వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తి కాకపోవడంతో మరో మూడు రోజులు పొడిగించనుంది.

Updated Date - 2021-08-29T16:27:45+05:30 IST