హైదరాబాద్: మల్కాజ్‌గిరిలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-08-15T20:09:05+05:30 IST

బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై దాడి ఘటన నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

హైదరాబాద్: మల్కాజ్‌గిరిలో ఉద్రిక్తత

హైదరాబాద్: బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై దాడి ఘటన నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ శ్రేణులు మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మల్కాజ్‌గిరిలో స్వాతంత్ర్య దినోత్సవవేడుకల్లో రసాభాస జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు బాహాబాహీకి దిగారు. 


మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి, స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌ల మధ్య వాగ్వివాదం జరిగింది. జాతీయ జెండాలో భారతమాత ఫోటో అంశంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు బీరు బాటిళ్ళతో దాడి చేశారు. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆస్పత్రికి వెళ్లి శ్రవణ్‌ను పరామర్శించారు.

Updated Date - 2021-08-15T20:09:05+05:30 IST