Hyderabad: అల్వాల్‎లో దారుణం

ABN , First Publish Date - 2021-08-03T14:32:00+05:30 IST

నగరంలోని అల్వాల్‌ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. బీహెచ్‌ఈఎల్‌ కాలనీ సమీపంలో రైల్వేట్రాక్‌ దగ్గర యువతిని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అల్వాల్‎లో...

Hyderabad: అల్వాల్‎లో దారుణం

హైదరాబాద్‌: నగరంలోని అల్వాల్‌ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. బీహెచ్‌ఈఎల్‌ కాలనీ సమీపంలో రైల్వేట్రాక్‌ దగ్గర యువతిని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అల్వాల్‎లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి సర్వతి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు అల్వాల్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తుండగా..(నేడు) మంగళవారం తెల్లవారుజామున డిగ్రీ విద్యార్థిని సరస్వతి (18)ని గుర్తు తెలియని దుండగుడు ఉరివేసి హత్య చేశాడు. అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక పోలీసులు ప్రేమ వ్యవహారంగా అనుమానిస్తున్నారు.

Updated Date - 2021-08-03T14:32:00+05:30 IST