హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెదక్ జిల్లా, చినశంకరపేటకు చెందిన మొయినుద్దీన్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించారని, తనకు న్యాయం చేయాలంటూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అతనిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.