జీఓ 46 అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

ABN , First Publish Date - 2021-06-22T21:22:00+05:30 IST

ఈ ఏడాది కూడా జీవో 46ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

జీఓ 46 అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్: ఈ విద్యా సంవత్సరం కూడా జీవో 46ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. కోవిడ్ నేపథ్యంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులపై జీఓ 46ని  ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది.


ఈ ఉత్తర్వుల ప్రకారం 2019-20 విద్యా సంవత్సరంలో ఉన్న ఫీజులనే ఈ ఏడాది కూడా కొనసాగించాలని, ఫీజు పెంచకూడదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అందులో ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని, అది నెల వారిగా మాత్రమే తీసుకోవాలని సూచించింది. ఈ ఉత్తర్వులను  గతేడాది ఉల్లంఘించిన పలు కార్పొరేట్, బడా ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ నోటీసులు ఇచ్చింది. 11 స్కూల్స్‌పై విచారణ కొనసాగుతోంది. కాగా  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. జీవో 46 ప్రకారమే ఫీజులు తీసుకోవాలని కొరనున్నారు.

Updated Date - 2021-06-22T21:22:00+05:30 IST