యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-06-18T16:39:05+05:30 IST

యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట్‌రోడ్డులో

యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్/ హైదర్‌నగర్‌: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట్‌రోడ్డులో ఈ నెల 11న ట్యూషన్‌ చెప్పేందుకు యువతి రోడ్డు దాటుతుండగా.. అదే సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి ఆమె నడుముపై కొట్టి పరారయ్యాడు. యువతి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా కేపీహెచ్‌బీకి చెందిన బ్యాంక్‌ ఉద్యోగి రవికుమార్‌గా గుర్తించి పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2021-06-18T16:39:05+05:30 IST