అంబులెన్స్‌లో ప్రసవం

ABN , First Publish Date - 2021-06-18T14:29:05+05:30 IST

ఓ నిండు గర్భిణీని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వాహనంలో ప్రసవం జరిగింది. మేడ్చల్‌ పట్టణంలోని టీచర్స్‌

అంబులెన్స్‌లో ప్రసవం

హైదరాబాద్: ఓ నిండు గర్భిణీని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వాహనంలో ప్రసవం జరిగింది.  మేడ్చల్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీవాసి అయిన గర్భిణిలక్ష్మి(24)ని గురువారం 108 వాహనంలో మేడ్చల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి నీలోఫర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా  మార్గమధ్యలో ట్యాంక్‌ బండ్‌ వద్ద లక్ష్మికి నొప్పులు తీవ్రంకావడంతో  సిబ్బంది ఈఎన్‌టీ దేవరాజ్‌, పైలట్‌ కిషన్‌ వాహనంలో ప్రథమ చికిత్స అందించడంతో ఆమె  పాపకు జన్మనిచ్చింది.

Updated Date - 2021-06-18T14:29:05+05:30 IST