జగదీష్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-05-14T13:37:44+05:30 IST

నగరంలోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల జగదీష్ మార్కెట్‌లో గత అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

జగదీష్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల జగదీష్ మార్కెట్‌లో గత అర్ధరాత్రి  భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పలు మొబైల్ షాప్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కో షాప్‌లో రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-05-14T13:37:44+05:30 IST