ఎంపీలు చైర్మన్‌గా జిల్లా స్థాయి విద్యుత్‌ కమిటీలు

ABN , First Publish Date - 2021-09-18T09:47:11+05:30 IST

ఎంపీలు చైర్మన్‌గా జిల్లా స్థాయి విద్యుత్‌ కమిటీలు

ఎంపీలు చైర్మన్‌గా జిల్లా స్థాయి విద్యుత్‌ కమిటీలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ రంగంలో కేంద్ర పథకాలను మరింత ప్రభావ వంతంగా అమలు చేయడంతోపాటు నిరంతర చర్చ, పర్యవేక్షణకు జిల్లాస్థాయి విద్యుత్‌ కమిటీలు వేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. జిల్లా స్థాయిలో సీనియర్‌ పార్లమెంట్‌ సభ్యుడు చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఇతర ఎంపీలు కో-చైర్మన్లుగా, జిల్లా కలెక్టర్‌ మెంబర్‌ సెక్రటరీగా, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు సభ్యుడిగా, కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల అధికారులు ఉంటారని గుర్తు చేసింది. ఈమేరకు రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శులు/ముఖ్యకార్యదర్శులు/ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 


Updated Date - 2021-09-18T09:47:11+05:30 IST