సీవీడీతో అత్యధిక మరణాలు

ABN , First Publish Date - 2020-09-28T12:13:20+05:30 IST

అత్యధిక మరణాలకు కార్డియో వాస్కులర్‌ డిసీజెస్‌ (సీవీడీ) కారణమవుతోందని కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. 29న వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

సీవీడీతో అత్యధిక మరణాలు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి):అత్యధిక మరణాలకు కార్డియో వాస్కులర్‌ డిసీజెస్‌ (సీవీడీ) కారణమవుతోందని కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. 29న వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.


కరోనా సమయంలో గుండె జబ్బులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ చాప్టర్‌ ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్‌ కేఎంకేరెడ్డి, గౌరవ కార్యదర్శి డాక్టర్‌ రాజీవ్‌గార్గ్‌, ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడిగా ఎంపికైన డాక్టర్‌ నరసరాజు, శ్రీధర్‌రెడ్డి పెద్ది, శ్రీకాంత్‌, డాక్టర్‌ హయగ్రీవరావు తదితరులు గుండె సమస్యలు, నివారణ చర్యలపై వివరించారు.


గుండె విషయంలో అప్రమత్తంగా ఉండడానికి ఈ ఏడాది ‘యాజ్‌ హార్ట్‌ టు బీట్‌ సీవీడీ’ ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. ఎవరికైనా గుండెపోటొస్తే అంబులెన్స్‌లోనే ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాపాయం నుంచి రక్షిస్తున్నామని చెప్పారు.

Updated Date - 2020-09-28T12:13:20+05:30 IST