భవిష్యత్తు... ICE కార్లదే... * EVల కంటే... హైబ్రిడ్ కార్ల వినియోగమే బెటర్ - MSL ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ

ABN , First Publish Date - 2022-06-24T21:14:53+05:30 IST

ICE((Internal combustion engine) కార్లు, విద్యుత్తు వాహనాలదే భవిష్యత్తు అని భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి(MSIL) చైర్మన్ RC భార్గవ పేర్కొన్నారు.

భవిష్యత్తు... ICE కార్లదే...  * EVల కంటే... హైబ్రిడ్ కార్ల వినియోగమే బెటర్  - MSL ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ


న్యూఢిల్లీ : ICE((Internal combustion engine) కార్లు,  విద్యుత్తు వాహనాలదే భవిష్యత్తు అని భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి(MSIL) చైర్మన్ RC భార్గవ పేర్కొన్నారు. మైండ్‌రష్ ఈవెంట్‌ సందర్భంగా  శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవలి నివేదికను ఉదహరిస్తూ ‘2030 నాటికి భారతీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో EVలు 5 శాతం మాత్రమే ఉండవచ్చు. పలు అభివృద్ధి చెందిన దేశాల కంటే ICE కార్లు భారత్ మార్కెట్‌లో ఎక్కువ కాలం ఆధిపత్యం చెలాయిస్తాయి. మనం ఎక్కువగా బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడటం కొనసాగిస్తున్నందున, EVలను వేగంగా  స్వీకరించడం సమంజసం కాదు. ఇప్పటికీ... 75 శాతం విద్యుత్తు బొగ్గుతో ఉత్పత్తవుతున్నదే. అందువల్ల...  ప్రయాణీకుల కార్ల నుండి కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి EVల కంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి’ అని పేర్కొన్నారు.


కాగా... EVల కంటే... భారత్‌లో  హైబ్రిడ్ కార్ల వినియోగమే సమంజసం’ అని పేర్కొన్నారు. కాగా... ICE మోడళ్ళ కంటే EVలు 50-70 శాతం ఎక్కువ ఖరీదు చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సెమీకండక్టర్ కొరత ప్యాసింజర్ వాహనాల సరఫరాపై తీవ్రమైన ప్రభావం చూపిందని, కాగా... ఈ ఏడాది సరఫరా పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నామని భరగవ్ చెప్పారు. రెండేళ్ళ క్రితం... అంటే... 2020 ప్రారంభంలో సెమీకండక్టర్ల ఉత్పత్తిని ప్రభావితం చేసిన COVID కారణంగా... సమస్య ప్రారంభమైందని, ఈ క్రమంలో నేర్చుకున్న పాఠాల నేపథ్యంలో  ఫ్యాక్టరీలు కూడా ఉత్పత్తిని పెంచుతున్నాయని భార్గవ వెల్లడించారు. కాగా... సంక్షోభాల కారణంగా సెమీకండక్టర్ల వంటి కీలక భాగాల సరఫరా కోసం విదేశీ కంపెనీలపై పూర్తిగా ఆధారపడటం సరైనది కాదని ఆటోమొబైల్ పరిశ్రమ గుర్తించింది. సెమీకండక్టర్ల కోసం ఇటీవల ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(PLI) పథకం గణనీయమైన పెట్టుబడిని ఆకర్షిస్తుందని, చిప్‌సెట్‌ల కోసం స్థానిక ఉత్పత్తి దోహదం చేస్తుందనిసహాయపడుతుందని భార్గవ భావిస్తున్నారు.

Updated Date - 2022-06-24T21:14:53+05:30 IST