హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల కౌంటింగ్ క్షణక్షణానికి ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ప్రతీ ఒక్క రౌండ్ చాలా కీలకం కావడంతో అన్ని పార్టీల్లోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం కనపర్చినప్పటికీ.. మొదటి రౌండ్ విషయానికి వచ్చేసరికి బీజేపీ పైచేయి సాధించింది. ఇక రెండో రౌండ్‌లో కూడా ఈటెల లీడ్‌లో ఉన్నారు. హుజూరాబాద్‌లో రెండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 4659 ఓట్లు రాగా, బీజేపీకి 4852 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 220 ఓట్లు వచ్చాయి. 193 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థిపై ఈటెల రాజేందర్ లీడ్‌లో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేనాటికి బీజేపీకి 9461 కు ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్‌కు 9103 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 339 ఓట్లు పోలయ్యాయి.