Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్ తీరుతో బాగా ఏడ్చాను.. నరకం చూపించారు: ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో ఈటల

హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయంతో అధికార టీఆర్ఎస్‌కు దిమ్మతిరిగేలా చేశారు బీజేపీ నేత ఈటల రాజేందర్. ఈ ఎన్నికలో గులాబీ దళం గెలిచేందుకు చేసిన ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. కానీ, ఈటల చరిష్మా ముందు అవన్నీ దిగదుడుపుగానే మిగిలిపోయాయి. ఈటలకు ప్రజలు భారీ మెజారిటీతో పట్టం కట్టారు. అధికార పక్షాన్ని కాదని తనపై నమ్మకంతో ప్రజలు తనను ఎమ్మేల్యేగా ఎన్నుకున్నారని చెప్పారాయన. తనను అసలు అసెంబ్లీలో కనిపించకుండా చేయడానికి సీఎం కేసీఆర్ చేయని కుట్ర అంటూ లేదని చెప్పుకొచ్చారు. ఈ విజయంలో తన భార్య పాత్ర కూడా ఉందన్నారు. ఆస్తులన్ని అమ్మేసినా కూడా పర్లేదు. కానీ, కేసీఆర్‌తో మాత్రం రాజీపడకు అని తనతో చెప్పినట్లు ఈటల అన్నారు. రాజీపడితే చంపేస్తానని భార్య తనతో చెప్పిందన్నరాయన. అలాగే కేసీఆర్ తనపట్ల ప్రవర్తించిన తీరుతో ఒకనొక సందర్భంలో బాగా ఏడ్చేసినట్లు చెప్పారు. తనకు నరకం చూపించారని తెలిపారు. సీఎంకు తనతో పాటు ఉండేవారిపై అసలు నమ్మకం ఉండదన్నారు ఈటల. తోటివారిని నమ్మని వ్యక్తితో మనగడం చాలా కష్టమని చెప్పారు. మంత్రిగా చూడని మమ్మల్ని కనీసం మనుషులుగా చూస్తే బాగుండు అనే బాధ ఉండేదన్నారు. ఇలా పలు ఆసక్తికర విషయాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఈటల చెప్పుకొచ్చారు. ఆ కార్యక్రమ వివరాలు ఈ ఆదివారం రాత్రి 8.30గంటలకు మీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో...

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

రాజకీయ నేతలుమరిన్ని...

Advertisement