మంత్రి గంగులను కలిసిన హుజూరాబాద్‌ నాయకులు

ABN , First Publish Date - 2021-05-17T05:58:15+05:30 IST

హుజురాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు.

మంత్రి గంగులను కలిసిన హుజూరాబాద్‌ నాయకులు

సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించిన నాయకులు


కరీంనగర్‌: హుజురాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. హుజురాబాద్‌ నియో జకవర్గం, కమలాపూర్‌, జమ్మికుంట మండ లాల్లోని శనిగరం, మర్రిపెల్లి గూడం గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పింగళి ప్రదీప్‌రెడ్డి ఆధ్వర్యంలో శని గరం సర్పంచ్‌ పింగళి రవళి రంజిత్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ మేకల తిరుపతి, సీనియర్‌ నేత చెరెపెల్లి రాంచందర్‌తో పాటు చాలామంది అక్కడి నాయకులు మంత్రి గంగులను కలిశారు. ఈ సందర్భంగా వారు తమ గ్రామాల్లోని ఉన్న సమస్యలను మంత్రి గంగులకు విన్నవించుకొని పరిష్కరించాలని కోరారు. ఈటల మంత్రి పదవిని, పార్టీలో తన స్థానాన్ని అడ్డుపెట్టుకొని హుజూరాబాద్‌లో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని అణిచి వేశాడని తమ గోడును వెళ్లబోసుకున్నారు. 


విభజించి పాలించు అనే రీతిలో పార్టీ నాయ కులు, కార్యకర్తలను ఈటల నిర్దాక్షిణ్యంగా అణచి వేశాడని మండిపడ్డారు. కేవలం తన స్వార్థంతో అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఈటల అనేక అక్రమాస్తులు సంపాదించుకున్నాడని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి అరకొరగా పనులు చేశారని, దీనితో నియోజక వర్గంలో అనేక సమస్యలను పరిష్కరించుకోలేదని ఆవేదన చెందారు. సమస్యలను పార్టీ, ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి ప్రయత్నించిన కార్యకర్తలను అణిచివే శారని మండిపడ్డారు. భూకబ్జా వ్యవహారంతో ఈటలను మంత్రి వర్గం నుంచి సీఎం కేసీఆర్‌ బర్తరఫ్‌ చేయడంతో మాకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లయిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈటెల సొంత మండలానికి చెందిన నేతలు పార్టీకి చెందిన ఏ ఒక్క కార్యకర్త కూడా రాజేందర్‌ వెంట లేరని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 


ఈ సందర్భంగా శనిగరం, మర్రెపల్లి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను మంత్రి గంగుల కమలాకర్‌కు దృష్టికి తీసుకు వచ్చారు. గతంలో ఈటల నిర్లక్ష్యంతో వెనుకకు పోయిన భగీరథ ఎతిపోతల స్కీంను రైతుల కాంట్రిబ్యూషన్‌ కింద పునరుద్ధరణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ గ్రామాల్లోని చెక్‌ డ్యాంల వరకూ రోడ్ల నిర్మాణంతో పాటు పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గానికి వస్తే పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం వస్తుందని, మా ఐక్యతను ప్రదర్శిస్తామని విజ్ఞప్తి చేశారు. 


మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ వాటి పరిష్కారం కోసం తక్షణమే కార్యాచరణ రూపొందిస్తానని హమీ ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న ప్రతిస మస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఎవరై అధైర్యపడవద్దని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తాను హుజూరాబాద్‌ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, పార్టీ హైకమాండ్‌ నిరంతరం మనతోనే ఉన్నదని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్‌ సీనియర్‌ నాయకుడు పింగళి ప్రదీప్‌ రెడ్డి, శనిగరం సర్పంచ్‌ పింగళి రవళిరంజిత్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ మేకల తిరుపతి, స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు చెరిపెల్లి రాంచందర్‌, కొలిపాక సాంబయ్య, చెరిపల్లి రతన్‌, ఎం.భిక్షపతి, సంగెం కవితా కరుణాకర్‌, కొత్తపెల్లి శ్రీదేవి రాజు, బండి కుమారస్వామి, కోల రమేశ్‌, కుక్కల యుగేందర్‌, బండి జ్యోతి భద్రయ్య, వి.సుప్రియ రామారావు, శీలపాక మంజుల భూమయ్య, వి.శివాజీ, శ్రీకాంత్‌, పవన్‌, సంగెం చంద్రశేఖర్‌, అభిలాష్‌, కిరణ్‌, ఎం మహేందర్‌, నిగ్గల కుమారస్వామి, రావుల సమ్మ య్య, చందబోయిన రవీందర్‌, ఎరుకల రాజయ్య, మేర కరుణాకర్‌, ఉప్పల సారంగం, కంకటి నరేష్‌, ఇ మొగిలి, ఇ సదయ్య, సీహెచ్‌ మొగిలి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-17T05:58:15+05:30 IST