హుజురాబాద్ ఉపఎన్నికలో భారీ ఎత్తున నామినేషన్లు: షర్మిల
ABN , First Publish Date - 2021-09-06T22:15:53+05:30 IST
హుజురాబాద్ ఉపఎన్నికకు నిరుద్యోగులతో భారీ ఎత్తున నామినేషన్లు వేస్తామని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించారు.
హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికకు నిరుద్యోగులతో భారీ ఎత్తున నామినేషన్లు వేస్తామని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. నామినేషన్ల కోసం కో-ఆర్డినేటర్‌గా భాస్కర్‌రెడ్డిని షర్మిల నియమించారు. నిరుద్యోగులు భారీ ఎత్తున ఉపఎన్నిక బరిలో నిలవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా వైఎస్ఆర్టీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నామినేషన్ల ప్రక్రియ, సహాయ సహకారాలు నిరుద్యోగులకు అందిస్తామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల జాప్యాన్ని నిరసిస్తూ హుజురాబాద్‌లో పోరాటం చేస్తామని షర్మిల ప్రకటించారు.