Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 26 2021 @ 17:34PM

హుజురాబాద్ బీజేపీ మేనిఫెస్టో విడుదల

కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ విడుదల చేసారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని రైల్వే స్టేషన్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే అవసరమున్నచోట ఆర్వోబీల నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో 60ఏళ్ల పైబడిన రైతులకు రూ.3వేల పెన్షన్ అందజేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి విద్యాలక్ష్మి పథకం ద్వారా సహాయం అందజేస్తామన్నారు. బేటీ బచావో, బేటీ పడావో, ఆయుష్మాన్ భారత్ పటిష్ట అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు రక్షిత మంచి నీరు అందిస్తామని తరుణ్‌చుగ్ విడుదల చేసిన మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement