హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

ABN , First Publish Date - 2021-11-02T14:02:50+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు, తెలంగాణలోని హుజురాబాద్‌ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.

హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

తొలిరౌండ్‌లో టీఆర్ఎస్‌కు ఇండిపెండెంట్ షాక్ (9:52 AM)

కారు గుర్తును పోలిన రొట్టెలపీట గుర్తుకు 112 ఓట్లు


బద్వేల్‌లో మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తి..(9.50AM)

బద్వేల్‌లో మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యింది. 23,754 ఓట్లతో వైసీపీ అభ్యర్థి సుధ ఆధిక్యంలో ఉన్నారు.


బద్వేల్‌లో రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తి(9:45AM)

బద్వేల్‌లో రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ రౌండ్‌లో కూడా వైసీపీ అభ్యర్థి సుధ ఆధిక్యంలో ఉన్నారు.



బద్వేల్‌లో తొలి రౌండ్ పూర్తి (9:40 AM)

8,790 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి సుధ ముందంజ

వైసీపీ : 10,478 ఓట్లు

బీజేపీ : 1,688 ఓట్లు

కాంగ్రెస్ : 580 ఓట్లు

నోటా : 342 ఓట్లు


166 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఈటల ముందంజ (9:38 AM)

తొలి రౌండ్‌లో :-

బీజేపీ : 4,610 ఓట్లు

టీఆర్ఎస్‌ : 4,444 ఓట్లు


హుజురాబాద్‌ తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం (9:28 AM)


బద్వేల్: కొనసాగుతున్న బద్వేల్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు (9:28AM)

బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నానికే పూర్తయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 10 నుంచి 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటలోపే వచ్చే వీలుందని సమాచారం.


బద్వేల్ : తొలి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఆధిక్యం (9:18 AM)


- హుజురాబాద్ మండల ఓట్ల లెక్కింపు ప్రారంభం (9:10 AM)


ఆధిక్యంలో టీఆర్ఎస్.. (8:30 AM)

హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరగ్గా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు జరుగనుంది. మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.


పోస్టల్ బ్యాలెట్‌లో వైసీపీ ఆధిక్యం (8:45 AM)

బద్వేల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. పోస్టల్ బ్యాలెట్‌లో వైసీపీ ఆధిక్యంలో ఉంది.


హుజురాబాద్ పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం (8:50 AM)

మొత్తం : 753 ఓట్లు

టీఆర్‌ఎస్‌ : 503  

బీజేపీ : 159

కాంగ్రెస్‌ : 32 

చెల్లని ఓట్లు : 14


ఇదిలా ఉంటే.. బద్వేల్ ఉప ఎన్నిక ఫలితం కంటే పోటీ చేసిన ప్రధాన పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు..? గెలిచే వారి మెజార్టీ ఎంత..? రెండో స్థానంలో నిలబడే పార్టీకి ఎన్ని ఓట్లు రావచ్చు..? అనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్‌ ఒక హాలులో కాకుండా నాలుగు హాళ్లలో చేపట్టనున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఇలాంటి ఏర్పాట్లు చేశారు. నాలుగు హాళ్లలో ఒక్కో హాలుకు ఏడు టేబుళ్లు ఏర్పాటు చేశారు. కాగా.. కౌంటింగ్‌ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. సెంటిమెంట్‌తో టీడీపీ పోటీకి దూరంగా ఉండగా..  వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ, బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్, కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీ చేసిన సంగతి తెలిసిందే. 


కడప/హుజురాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు, తెలంగాణలోని హుజురాబాద్‌ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో ఈ రెండుచోట్ల గెలుపెవరిదో దాదాపు తేలిపోనుంది. హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ భవితవ్యం నేడు తేలిపోనున్నది. పోలింగ్‌ సందర్భంగా వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఒకటి మినహా అన్ని సంస్థలు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించనున్నారని తేల్చిచెప్పాయి. ఇంటెలిజెన్స్‌ వర్గాల నివేదికలు, రాజకీయ విశ్లేషకుల అంచనాలన్నీ బీజేపీవైపే మొగ్గు చూపిస్తున్నా కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-11-02T14:02:50+05:30 IST