Advertisement
Advertisement
Abn logo
Advertisement

హువాయ్‌ నుంచి మరో మడత ఫోను

ఫోల్డబుల్‌(మడత) ఫోన్లను విడుదల చేసిన తొలి కంపెనీల్లో హువాయ్‌ ఒకటి. హువాయ్‌ మేట్‌ఎక్స్‌, హువాయ్‌ మేట్‌ఎక్స్‌ఎ్‌సని అప్పట్లోనే మార్కెట్లోకి తీసుకువచ్చింది.  ఈ ఏడాది ఫిబ్రవరిలో మేట్‌ ఎక్స్‌2ని విడుదల చేసిన హువాయ్‌ తాజాగా మరొక డిజైన్‌తో ముందుకు వస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ సిరీస్‌ ఫోన్‌ మాదిరిగా ఉంది. స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి మడత డిజైన్‌ను మారుస్తున్నట్టు సమాచారం. తదుపరి జనరేషన్‌ అంటే కొద్ది కాలం క్రితమే డెవలప్‌ చేసిన జోలీ టెక్నాలజీని   

   

ఉపయోగిస్తున్నట్టు వినికిడి. ఇంతకుమునుపు ఫోన్లలో వినియోగించిన వాటితో పోలిస్తే ఇది స్థిరంగానూ, మరింత సౌకర్యంగా ఉంది. తక్కువ విడి భాగాలు వాడుతున్నందున వ్యయం కూడా తగ్గుతుంది. అధికారికంగా సమాచారం లేనప్పటికీ ఈ  కొత్త ఫోన్‌కు హవాయ్‌ మేట్‌ వి అని పేరుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 4జీ మోడల్‌కు తోడు కిరిన్‌ 9000 ప్రాసెసర్‌ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. 

Advertisement
Advertisement