అర్బన్‌ ఇళ్లు ఎప్పుడిస్తారో..

ABN , First Publish Date - 2020-10-18T07:44:41+05:30 IST

ప్రధాన మంత్రి ఆవాజ్‌ యోజన(పీఎంఏవై) పథకం కింద చాలా కిందట నిర్మించిన ఇళ్లు వృఽథాగా ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే నిర్మించి, గతేడాది జనవరిలోనే గృహ ప్రవేశాలకు సిద్ధం చేసి ఇళ్లను ఇప్పటివరకూ లబిదార్లకు ఇవ్వకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అర్బన్‌ ఇళ్లు ఎప్పుడిస్తారో..

  •  హైకోర్టు ఆదేశంతో  లబ్ధిదార్లలో ఆశలు 8 గ్రౌండ్‌ అయినవి 25,360
  • ఆగిపోయిన ఇళ్లు సుమారు 1,700 8 లబ్ధిదారుల కోసం సిద్ధమైనవి  14,000
  • లబ్ధిదారులు వాటా సొమ్ము చెల్లించినా  రుణాలివ్వని బ్యాంకులు
  • క్వారంటైన్‌ సెంటర్లుగా మారిన బొమ్మూరు, బోడసకుర్రు హౌసింగ్‌ 

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ప్రధాన మంత్రి ఆవాజ్‌ యోజన(పీఎంఏవై) పథకం కింద చాలా కిందట నిర్మించిన ఇళ్లు వృఽథాగా ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే నిర్మించి, గతేడాది జనవరిలోనే గృహ ప్రవేశాలకు సిద్ధం చేసి ఇళ్లను ఇప్పటివరకూ లబిదార్లకు ఇవ్వకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతవరకూ ఎందుకు ఇవ్వలేదు, అసలు ఎన్ని మంజూరు చేశారు. ఎన్ని కట్టారు, ఎన్ని పూర్తయ్యాయి ఇంతవరకూ ఎందుకు ఇవ్వలేదో నివేదిక సమర్పించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించింది. కోర్టు జోక్యంతోనైనా తమకు వెంటనే గృహప్రవేశ యోగం లభిస్తుందనే ఆశ ఇప్పుడు లబ్ధిదార్లలో చిగురించింది. వచ్చే సంక్రాంతిలోపు కొత్త ఇళ్లలోకి వెళ్లిపోదామనే నమ్మకం కలిగింది. జిల్లాలో సుమారు ఐదేళ్ల కిందట ప్రధానమంత్రి ఆవాజ్‌యోజనా పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అర్బన్‌ ఏరియాలోని పేదలకు ఇళ్లను ఇవ్వడానికి జిల్లాలో 30 వేలకు పైగా ఇళ్లు మంజూరుకాగా, 25,360 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. రాజమహేంద్రవరం, బోడసకుర్రు, మండపేట, రామచంద్రపురం, కాకినాడ, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే చాలా వరకూ ఇళ్లను పూర్తి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు జనవరిలో సుమారు 14,000 మందితో గృహ ప్రవేశాలు చేయించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఎన్నికల వల్ల ఆగిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ఇళ్లను పంపిణీ చేయలేదు. జిల్లాలో మొత్తం 25,360 ఇళ్లు నిర్మాణంచేపట్టగా, రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో వైసీపీ ప్రభుత్వం రామచంద్రాపురంలో 960, మండపేటలో 96, కాకినాడలో సుమారు 600 వరకూ ఇళ్లను ఆపేసింది. 14,000 ఇళ్లు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. మిగతావి పను లు పూర్తి చేయవలసి ఉంది. నిర్మాణం పూర్తయిన ఇళ్లలో బొమ్మూరు, బోడసక్రురు ఇళ్లను  కొవిడ్‌-19కి సంబంధించిన క్వారంటైన్‌ సెంటర్లు చేశారు. మిగతా ఇళ్లన్నీ నిరుపయోగంగా ఉన్నా యి. పేద ప్రజలు, చిన్నచిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ అద్దె ఇళ్లలో ఉంటున్న జనం ఈ ఇళ్లపై ఎంతో ఆశ పెట్టుకున్నారు. అన్ని హం గులతో నిర్మించిన ఇళ్లను మాత్రం లబ్ధిదార్లకు ప్రభుత్వం ఇవ్వడంలేదు. దీనిపైనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదట్లో లబ్ధిదార్లను ఎంపిక చేసి వారి వాటా కింద కొంత సొమ్మును కట్టించుకున్నారు. అది ఆయా మున్సిపాల్టీల పరిధిలో ఉంది.  వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది లబ్ధిదార్లను తొలగించింది. వారికి డబ్బు కూడా వాపస్‌ ఇవ్వలేదు. పైగా కొత్త వారిని ఎంపిక చేసింది. వారికి ఇంతవరకూ ఎలాట్‌మెంట్‌ లెటరూ ఇవ్వలేదు. బ్యాంక్‌ రుణా లు ఇప్పించలేదు. హైకోర్టు జోక్యంతోనైనా వారి కలలు నెరవేరతాయని ఎదురుచూస్తున్నారు. 

Updated Date - 2020-10-18T07:44:41+05:30 IST