Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 23 Sep 2022 03:15:33 IST

పల్నాడులో వైసీపీ కార్యకర్తల హల్‌చల్‌

twitter-iconwatsapp-iconfb-icon
పల్నాడులో వైసీపీ కార్యకర్తల హల్‌చల్‌

చిన్న ఘర్షణతో టీడీపీ వారిపై దాడికి సిద్ధం

కర్రలు, ఈటెలు, కత్తులతో స్వైర విహారం

పోలీసుల సమక్షంలోనే బరితెగింపు


రాజుపాలెం, సెప్టెంబరు 22: పల్నాడులో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసుల సమక్షంలోనే కర్రలు, ఈటెలు, కత్తులతో స్వైర విహారం చేశారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో గురువారం పులికొండ సీతారామయ్య, చావలి నాగరాజుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ‘నన్నెందుకు తిడుతున్నా’వంటూ నాగరాజును సీతరామయ్య ప్రశ్నించటంతో వారి మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. స్థానికులు ఇద్దరికీ సర్దిచెప్పి పంపారు. ఆతర్వాత నాగరాజు వైసీపీ కార్యకర్తలతో కలసి ఈటెలు, కర్రలు, కత్తులతో గ్రామం మొత్తం తిరిగారు. గ్రామంలోని టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లి కర్రలతో తలుపుల మీద బాదుకుంటూ వెళ్లిపోయారు. అప్పటికే కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఇళ్లు విడిచి వెళ్లారు. ఇద్దరు పోలీసులు అక్కడ ఉండగానే వైసీపీ కార్యకర్తలు స్వైర విహారం చేయడం గమనార్హం. గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. ఘర్షణపడ్డ సీతారామయ్య టీడీపీ మద్దతు దారుడు కాగా నాగరాజు వైసీపీ మద్దతుదారుడు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఆంధ్రప్రదేశ్ Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.