KBC లో రూ.కోటి విలువైన ప్రశ్న.. తెలియదంటూ క్విట్ అయ్యాడు.. ఊహించి సమాధానం చెప్పమని Amitabh కోరితే..

ABN , First Publish Date - 2021-10-14T13:16:04+05:30 IST

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి(మీలో ఎవరు కోటీశ్వరుడు తెలుగుకి హిందీలో మాతృక) టీవీ కార్యక్రమంటే తెలియని వారుండరు. ఎనబై ఏళ్ల వయసుకి చేరువలో ఉన్న అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌పతి 13వ సీజన్ చేస్తున్నారు...

KBC లో రూ.కోటి విలువైన ప్రశ్న.. తెలియదంటూ క్విట్ అయ్యాడు.. ఊహించి సమాధానం చెప్పమని Amitabh కోరితే..

సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి(మీలో ఎవరు కోటీశ్వరుడు తెలుగుకి హిందీలో మాతృక) టీవీ కార్యక్రమంటే తెలియని వారుండరు. ఎనబై ఏళ్ల వయసుకి చేరువలో ఉన్న అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌పతి 13వ సీజన్ చేస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లతో మాట్లడేతీరు, అలంరించేతీరు అందరినీ ఆకట్టుకుంటుంది. 


ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గేవారు వేల రూపాయల నుంచి కోట్ల వరకు డబ్చుని గెలుచుకుంటారనేది అందరికీ తెలుసు. కానీ వచ్చిన వారందరూ కోటి రూపాయల ప్రశ్న వరకూ చేరుకోవడం కష్టం. ఇటీవల అలా కోటి రూపాయల ప్రశ్న వరకు చేరుకున్న వారిలో పూణెకి చెందిన వ్యాపారవేత్త హుస్సేన్ వోరా ఒకరు. ఆయన తన వద్ద ఉన్న నాలుగు లైఫ్ లైన్లు ఉపయోగించి 14 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అప్పటికే ఆయన రూ.50 లక్షలు గెలుచుకున్నారు.


ఇక 15వ ప్రశ్న కోటి రూపాయల కోసం అని అమితాబ్ బచ్చన్ చెప్పడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇలాంటి కీలక ప్రశ్నలు అడిగే ముందు అమితాబ్ కంటెస్టెంట్లతో కాస్త పర్సనల్ విషయాలు అడుగుతారు. అలా ఈ సారి హేస్సేన్ వోరాని అడిగారు. "మీరు ఈ డబ్బు గెలుచుకొని ఏం చేస్తారు?" అని అమితాబ్ అడిగారు. దానికి హుస్సేన్ వోరా.. తనకు ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉందని అది నేరవేర్చుకుంటానని అన్నారు.


"సరే.. ఇక కోటి రూపాయల కోసం 15వ ప్రశ్న.." అమితాబ్ తన భీకర స్వరంతో అడిగారు. 

ప్రశ్న: ప్రపంచంలోని అతి ఎత్తైన పర్వతాలు ఎయిట్-థౌజెండర్స్(eight-thousanders.. ప్రపంచంలో 8000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన పర్వతాలు 14 ఉన్నాయి)లో అతి తక్కువ ఎత్తైన పర్వతం ఏది?

ఎ. నంగా పర్బత్   బి. అన్నపూర్ణ   సి. గషేర్ బ్రమ్   డి. శిషపంగ్మా


హుస్సేన్‌కు మంచి జనరల్ నాలెడ్జ్‌ ఉందని.. అందుకే పుణేలో అతని స్నెహితులంతా హుస్సేన్‌ని మిస్టర్ గూగుల్ అని పిలుస్తుంటారు. ఇక కోటి రూపాయల ప్రశ్న కావడంతో అతను బాగా ఆలోచించాడు. ఎయిట్-థౌజెండర్స్ గురించి తనకు తెలిసిన కొన్ని విషయాలు అమితాబ్‌తో పంచుకున్నాడు. కానీ సరైన సమాధానం తనకు తెలియదని ఒప్పుకున్నాడు. తప్పుడు సమాధానం చెప్పి గెలిచిన రూ.50 లక్షలు పోగొట్టుకోవడం ఎందుకొని క్విట్ చేశాడు(వైదొలిగాడు).


కానీ అమితాబ్ అతడిని అప్పుడే వదల్లేదు. వెళ్లిపోయేముందు.. ప్రశ్నకు తను ఊహించిన సమాధానం చెప్పమని అడిగారు. దానికి హుస్సేన్ 'ఎ. నంగా పర్బత్' అని సమాధానం చెప్పాడు. అందరూ అది కరెక్ట్ అని భావించారు. కానీ అమితాబ్ అది తప్పు అని చెప్పి. సరైన సమాధానం 'డి. శిషపంగ్మా' అని చెప్పారు.


ఈ వారం శుక్రవారం స్పెషల్ ఎపిసోడ్‌లో 'షోలే' సినిమా తారలు రీయునియన్ కానున్నారు. నటి హేమా మాలిని, నిర్మాత, దర్శకుడు రమేశ్ సిప్పీ అతిథులుగా రానున్నారు. ఆల్ టైం హిట్ చిత్రం 'షోలే' ఈ సంవత్సరం 46 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమా మాలిని, అంజద్ ఖాన్, సంజీవ్ కుమార్, జయా బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించారు.


Updated Date - 2021-10-14T13:16:04+05:30 IST