Viral News: భార్య, భర్త.. ఓ బస్సు..

ABN , First Publish Date - 2022-07-31T17:35:07+05:30 IST

సాధారణంగా తాము వెళ్లాల్సిన కార్పోరేషన్‌ బస్సు కోసం బస్టాపులో ఎదురుచూస్తుంటారు ప్రయాణీ కులు. కానీ కేరళ(Krala)లోని అలప్పూజ(Alappuzha)- కరుణగప్పల్లి(Karunagappalli) రూటులో నడిచే బస్సు కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో ఎక్కేందుకు ఉత్సాహం చూపుతారు. ఎందుకంటే ఆ బస్సులో అనేక ప్రత్యేక

Viral News: భార్య, భర్త.. ఓ బస్సు..

సాధారణంగా తాము వెళ్లాల్సిన కార్పోరేషన్‌ బస్సు కోసం బస్టాపులో ఎదురుచూస్తుంటారు ప్రయాణీ కులు. కానీ కేరళ(Kerala)లోని అలప్పూజ(Alappuzha)- కరుణగప్పల్లి(Karunagappalli) రూటులో నడిచే బస్సు కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో ఎక్కేందుకు ఉత్సాహం చూపుతారు. ఎందుకంటే ఆ బస్సులో అనేక ప్రత్యేకతలున్నాయి కాబట్టి.


అందమైన ఎల్‌ఈడీ లైట్లతో వెలిగిపోయే ఆ బస్సు(Bus)లో మ్యూజిక్‌ సిస్టమ్‌, సీసీ టీవీ కెమెరా, ఆటో మేటిక్‌ ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలతో పాటు... బస్సు మొత్తం అందమైన డెకరేషన్‌ తో అందర్నీ ఆకట్టుకుంటుంది. అంతేకాదండోయ్‌... ఆ బస్సు నడిపే డ్రైవర్‌(Driver) గిరి గోపీనాథ్‌, కండక్టర్‌(conductor)తార ఇద్దరూ భార్యభర్తలు(Wife and Husband). ఇన్ని విశేషాలున్నాయి కాబట్టే ఆ రూట్‌లో నడిచే ఈ స్పెషల్‌ బస్సులో ప్రయాణించాలనుకుంటారు చాలామంది. కేరళ రాష్ట్ర ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే ఈ బస్సును దంపతులిద్దరూ తమ సొంత ఖర్చుతో అందంగా డెకరేట్‌ చేశారు.



ఇటీవల వల్లికాదన్‌ అనే ఒక అబ్బాయి సదరు బస్సులో ప్రయాణిస్తూ దాని ప్రత్యేకతను వీడియో రూపంలో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో చూసినవారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటికే ఈ బస్సులో రెగ్యులర్‌ ప్రయాణీకులు కూడా వాట్సాప్స్‌ గ్రూపుల్లో వీరి గురించి ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెట్టారు. అవన్నీ వైరల్‌ కావడంతో గోపీనాథ్‌ దంపతులను ప్రస్తుతం సెలబ్రిటీలుగా చూస్తూ, వారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.

Updated Date - 2022-07-31T17:35:07+05:30 IST