Abn logo
Sep 27 2021 @ 16:43PM

పెళ్లైన 5 రోజుల తర్వాత.. సమోస బండి దగ్గర కూర్చోమని భార్యకు చెప్పి.. ఓ భర్త చేసిన నిర్వాకమిది!

వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేయసిని కలవడానికి ప్రియుడు తరచూ ఆమె ఊరెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఈ ప్రేమజంట స్థానికుల కంటపడింది. వారు ఇదేంటని నిలదీయడంతో.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఈ నెల 21న వాళ్లు వివాహంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లయిన అయిదో రోజే అతడో వింత నిర్వాకానికి పాల్పడ్డాడు. భార్యను సమోసా బండి వద్ద కూర్చోబెట్టి వెళ్లిన అతడు అదృశ్యమయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..


ఉత్తర ప్రదేశ్‌లోని లాల్‌గంజ్ కొత్వారి ప్రాంతానికి చెందిన ఓ యువతికి అంబారా గ్రామానికి చెందిన అభిషేక్ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రియురాలిని కలవడానికి అతడు ఆమె ఊరికి వెళ్లేవాడు. అయితే ఓ రోజు వారిని స్థానికులు గమనించి, ఏంటని నిలదీయగా తామిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో పంచాయతీ పెట్టి.. వారికి ఈ నెల 21న పెళ్లి చేశారు. తర్వాత నాలుగు రోజులు స్థానిక హోటల్‌లో గడిపారు. సరిగ్గా ఐదో రోజు భార్యని బయటికి తీసుకొచ్చి సమోస బండి దగ్గర కూర్చోమని చెప్పాడు. ఎందుకని ఆమె ప్రశ్నించగా.. తన తండ్రి, బావ వచ్చాడని.. వాళ్లని కలిసి కొంత డబ్బు తీసుకొస్తానని చెప్పాడు. అది నమ్మిన ఆమె సరేనని సమోస బండి దగ్గరే కూర్చుంది. చాలాసేపు భర్త కోసం ఎదురుచూసింది. అయినా అతడు తిరిగి రాలేదు. దీంతో ఆమె చేసేదేమి లేక పుట్టింటికి వెళ్లి, జరిగిందంతా కుటుంబసభ్యులకు చెప్పింది. 


అందరూ కలిసి అభిషేక్ కోసం గాలించారు. కానీ అతడు దొరకలేదు. దీంతో వారు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి సోమవారం కూడా పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని వెతికే పనిలో ఉన్నారు.

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...