కట్టుకున్న వాడిని కడ తేర్చింది

ABN , First Publish Date - 2021-06-18T04:22:42+05:30 IST

ప్రియుడితో కలిసి ఓ మహిళ తాళికట్టిన భర్తనే కడతేర్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పానుగోతుతండా(బోరింగ్‌తండా)లో వెలుగు చూసింది.

కట్టుకున్న వాడిని కడ తేర్చింది
అస్తి పంజరానికి పంచనామా..

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య 8 పానుగోతుతండాలో దారుణం

మృతదేహాన్ని బూర్గంపాడు గోదావరి ఇసుకలో పూడ్చిపెట్టిన నిందితులు

పోలీసులకు మృతుడి తల్లి ఫిర్యాదు .. విచారణతో వెలుగులోకి సంఘటన

టేకులపల్లి, జూన్‌ 17: ప్రియుడితో కలిసి ఓ మహిళ తాళికట్టిన భర్తనే కడతేర్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పానుగోతుతండా(బోరింగ్‌తండా)లో వెలుగు చూసింది. బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన టేకులపల్లి పోలీసులు నిజం నిగ్గుతేల్చారు. టేకులపల్లి పోలీసుస్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ బి.రాజు వెల్లడించారు. మండలంలోని పానుగోతుతండా కు చెందిన అజ్మీర రాము(35), ఆయన భార్య లలిత కూలీ పనులతో పాటు మేకలు, గొర్రెల వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడేనికి చెందిన గొర్రెల వ్యాపారి కంసాని కృష్ణతో వారికి పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ కృష్ణ పానుగోతుతండాలోని రాము ఇంటికి వస్తూ పోతుండేవాడు. దాంతో వారి మధ్య పరిచయం పెరగగా ఈ క్రమంలో భర్త రాము ఇంట్లోలేని సమయంలో లలిత కృష్ణతో వివాహేతర సంబం ధం కొనసాగించేది. ఈ విషయం రాముకు తెలియడంతో భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో భర్తను అడ్డు తొలగించేందుకు లలిత తన ప్రియుడితో కలిసి పథకం పన్నింది. గత నెల 15న లలిత పిల్లలు తన అత్తతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు. దాంతో ఇదే అదునుగా భా వించిన లలిత తన భర్తతో పాటు తాను మాత్రమే ఉన్నట్టు కృష్ణకు ఫోన్‌ద్వారా సమాచారం అందించింది. వెంటనే కృష్ణ రాముకు ఫోన్‌చేసి మేకల వ్యాపారం పనిపై భద్రాచలం వెళ్లాలని తెలపడంతో రాము, లలిత అతడితో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో బూర్గంపాడు దాటిన తరువాత గోదావరి ఇసుకలో ముగ్గురు మద్యం తాగారు. రాముకు అతిగా తాగించి తా డుతో అతడి మెడకు ఉరివేసి హత్య చేశారు. తరువాత అక్కడే ఇసుకలో మృతదేహాన్ని పాతి పెట్టారు. అనంతరం లలిత తన ఇద్దరు పిల్లలను తీసుకొని కృష్ణతో కలిసి కృష్ణా జిల్లాలో తల దాచుకొని బుధవారం పిల్లలను తీసుకొని లలిత ఇంటికి వచ్చింది. అయితే ఈనెల 8నుంచి తన కొడుకు, కోడలు, పిల్లలు కనిపించకపోవడంతో అనుమానంతో రాము తల్లి లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లలిత ఇంటికి వచ్చిన తరువాత పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. టేకులపల్లి సీఐ రాజు, ఎస్‌ఐ రాజ్‌కుమార్‌, బూర్గంపాడు పోలీసులు, టేకులపల్లి తహసీల్దార్‌ కేవీ శ్రీనివాసరావు గురువారం సంఘటన జరిగిన బూర్గంపాడు మండలంలోని గోదావరి నది వద్దకు వెళ్లి ఇసుకలో పాతిపెట్టిన శవాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు టేకులపల్లి సీఐ రాజు తెలిపారు.


Updated Date - 2021-06-18T04:22:42+05:30 IST