జూమ్‌ కాల్‌లో భర్త.. వెనుక నగ్నంగా భార్య

ABN , First Publish Date - 2021-04-05T13:40:39+05:30 IST

ఆయనో రాజకీయ నేత. అదేమో కరోనా వ్యాప్తి, మరణాలపై అధ్యయనం కోసం నిర్దేశించిన ఓ పార్లమెంటరీ సమావేశం. ప్రతినిధులతో ఆయన తన ఇంట్లో నుంచే జూమ్‌ యాప్‌ ద్వారా చర్చిస్తున్నారు. కొద్దిసేప

జూమ్‌ కాల్‌లో భర్త.. వెనుక నగ్నంగా భార్య

  • అవాక్కయిన సమావేశ ప్రతినిధులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: ఆయనో రాజకీయ నేత. అదేమో కరోనా వ్యాప్తి, మరణాలపై అధ్యయనం కోసం నిర్దేశించిన ఓ పార్లమెంటరీ సమావేశం. ప్రతినిధులతో ఆయన తన ఇంట్లో నుంచే జూమ్‌ యాప్‌ ద్వారా చర్చిస్తున్నారు. కొద్దిసేపటికి ఆయన భార్య ఒంటిమీద నూలుపోగు లేకుండా వచ్చి వెనుక నిల్చుంది. ఆవలివైపు సమావేశంలోని ప్రతినిధులు అవాక్కయ్యారు. తన వెనుక భార్య నగ్నంగా నిల్చున్నదనే సంగతి తెలియని ఆ నేత, జోరుగా చర్చలో మునిగిపోయారు. ‘అందరూ చూస్తున్నారు. సమావేశంలో ఉన్నారనే విషయాన్ని మీరు ఆమెకు చెప్పలేదా?’ అంటూ ఓ ప్రతినిధి చెప్పడంతో ఆ నేత వెనక్కు తిరిగారు. న్యూడ్‌గా భార్య కనిపించే సరికి నోరెళ్ల బెట్టారు! సౌతాఫ్రికాలో ఇటీవల గ్జోలిలే డేవు అనే నేతకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆ నేత సిగ్గుతో రెండు చేతులను ముఖానికి అడ్డుపెట్టుకున్నారు. తర్వాత సమావేశ ప్రతినిధులకు క్షమాపణలు చెప్పారు.


Updated Date - 2021-04-05T13:40:39+05:30 IST